Saturday, July 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విచారణ కమిటి సభ్యులపై విచారణ చేపట్టాలి

విచారణ కమిటి సభ్యులపై విచారణ చేపట్టాలి

- Advertisement -
  • ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి మహేశ్ డిమాండ్
    నవతెలంగాణ-బెజ్జంకి

    ఆదర్శ విద్యాలయంలో ఇటీవల విద్యార్థులు చేపట్టిన అందోళనకు స్పందించిన జిల్లా పరిపాలనాధికారి హైమావతి తక్షణం స్పందించి సిబ్బందిపై చర్యలు చేపట్టారు. విద్యార్థులతో సిబ్బంది వ్యవహరించిన తీరుపై జిల్లా పరిపాలనాధికారి ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటుచేసి పారదర్శకంగా విచారణ చేపట్టి నివేదిక అందించాలని సూచించారు. విద్యాలయంలో విచారణకు వచ్చిన కమిటి సభ్యులు ఖర్చుల పేరునా నగదు డిమాండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. విచారణ కమిటి సభ్యులు నగదు డిమాండ్ చేయడంపై నవతెలంగాణ దినపత్రిక ‘అంతా మా ఇష్టం’శీర్షీకతో విచారణ కమిటీ సభ్యుల చేతివాటం..?వార్తను ప్రచురించింది. నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి జిల్లా పరిపాలనాధికారికి నివేదిక అందజేయాల్సిన కమిటి సభ్యులు ఖర్చుల పేరునా బాధితులను నగదు డిమాండ్ చేయడం విచారణలో పారదర్శకత లోపిస్తుందని, నగదు డిమాండ్ చేసిన ప్రత్యేక విచారణ కమిటి సభ్యులపై విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు చేపట్టాలని శనివారం ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి దొంతరవేణి మహేశ్ జిల్లాధికారులను డిమాండ్ చేశారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -