Saturday, July 25, 2026
E-PAPER
Homeఖమ్మంభక్తి శ్రద్ధలతో 'సండ్ర' తొలి 'ఏకాదశి' పూజలు

భక్తి శ్రద్ధలతో ‘సండ్ర’ తొలి ‘ఏకాదశి’ పూజలు

- Advertisement -

నవతెలంగాణ-సత్తుపల్లి 
తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని సత్తుపల్లి పట్టణంలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర ఆలయాల్లో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక ద్వారకాపురిలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం, మండలంలోని కొత్తూరు శ్రీ శ్రీ శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో సండ్ర ప్రత్యేక పూజలు జరిపించుకొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఏకాదశి సందర్భంగా ఆలయ దర్శనానికి వచ్చిన సండ్రను ఆయా దేవాలయాల అర్చకులు సాదరంగా ఆహ్వానించారు.

ప్రత్యేక పూజలు జరిపించి స్వామివారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ.. తొలి ఏకాదశి పర్వదినాన్ని ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు,  సుఖశాంతులతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ మాజీ చైర్మన్ కూసంపూడి మహేష్, ఆత్మ మాజీ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, మల్లూరు అంకంరాజు, కోటగిరి వెంకటరావు, ఒగ్గు జగ్గారెడ్డి, చాంద్ పాషా, పర్వతనేని వేణు, ఐనంపూడి సత్యం, జొన్నలగడ్డ విజయ్, సుంకర వాసుదేవరావు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -