నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ మండలంలోని తోటపల్లి గ్రామంలో ఆషాఢ మాసం సందర్భంగా శనివారం గ్రామ సర్పంచ్ బంక లక్ష్మి చందు ఆధ్వర్యంలో గోరింటాకు వేడుకలు సంప్రదాయబద్ధంగా, ఉత్సాహభరితంగా నిర్వహించారు. గోరింటాకు ఆకులను సేకరించి, వాటిని సంప్రదాయ పద్ధతిలో రుబ్బి ఒకరికి ఒకరు గోరింటాకు పెట్టుకున్నారు. ఆటలు, పాటలు, జానపద గోరింటాకు గీతాలతో మహిళలు ఆనందోత్సాహాల మధ్య వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ బంక లక్ష్మి చందు మాట్లాడుతూ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం తెలుగు సంస్కృతిలో ప్రత్యేకమైన సంప్రదాయమని అన్నారు. గోరింటాకు శరీరానికి చల్లదనాన్ని అందించడంతో పాటు చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పోలు రాజు, వార్డు సభ్యులు మానుక కుమార్, పోషవేణి కుమార్, శాతవేణి అనూష చందు, బొంగోని రేణుక రమేష్, పోగుల కవిత సత్యం గ్రామ మహిళలు పాల్గొన్నారు.
తోటపల్లిలో ఘనంగా గోరింటాకు వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



