Saturday, July 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా తొలి ఏకాదశి వేడుకలు

ఘనంగా తొలి ఏకాదశి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – తొగుట
తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని  వెంకట్రావుపేటలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాల యంలో శనివారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవాలయ అర్చకు లు రమణాచార్యులు ఆధ్వర్యం లో స్వామివారికి పంచామృతాభిషేకం, శ్రీ రుక్మిణి – సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారికి పుష్పార్చన, తులసీ అర్చన, ప్రత్యేక నైవేద్యం సమర్పించారు. అనంతరం విష్ణు సహస్రనామ పారాయ ణం నిర్వ హించి భక్తులకు తీర్థప్రసాదాలను అంద జేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండారు కవితా స్వామిగౌడ్, దేవాలయ కమిటీ చైర్మన్ రాయరావు అరుణ – రఘుపతిరావు, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అలాగే గ్రామంలోని వెంకటే శ్వర ఆలయంలో సైతం భక్తులు పెద్ద ఎత్తున ఏకా దశి ఉత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వ హించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -