నవతెలంగాణ-ఆర్మూర్
పట్టణంలోని సిద్దులగుట్ట వద్ద నిర్మించిన తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద రెండవ పిరమిడ్ శ్రీ నవనాథ సిద్దేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం వద్ద గురు పౌర్ణమి వేడుకలను 28 మంగళవారం నిర్వహించడం జరుగుతుందని పిఎస్ఎస్ఎం జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణ రెడ్డి శనివారం తెలిపారు. మంగళవారంఉదయం 7 గంటల నుండి బుధవారం ఉదయం 7 గంటల వరకు 24 గంటల పాటు అఖండ ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గురుపౌర్ణమి వేడుకలు, సాంస్కృతిక కార్యక్రమాలు సీనియర్ మాస్టర్ల ధ్యాన అనుభవాలు నిర్వహించడం జరుగుతాయని తెలిపారు. మహేశ్వర మహా పిరమిడ్ ట్రస్ట్ సెక్రెటరీ బ్రాహ్మణ రత్న శ్రీ మారం శివప్రసాద్ బ్రహ్మర్షి ప్రేమ్ నాథ్ , మహేశ్వర మహా పిరమిడ్ ట్రస్ట్ సభ్యులు దామోదర మహస్వామి , నియోజకవర్గ శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వినయ్ కుమార్ రెడ్డి, తదితరులు హాజరవుతున్నారని ఈ కార్యక్రమంనికి సకాలంలో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు.
28న గురుపౌర్ణమి వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



