Saturday, July 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాటారం మోడల్ సోలార్ విలేజ్ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

కాటారం మోడల్ సోలార్ విలేజ్ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ-మల్హర్ రావ
కాటారం మోడల్ సోలార్ విలేజ్ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.శనివారం ఐడిఓసి కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘పి.ఎమ్.సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ కింద మోడల్ సోలార్ విలేజ్‌గా ఎంపికైన కాటారం మండల కేంద్రంలో సోలార్ రూఫ్‌టాప్ ప్లాంట్ల ఏర్పాటుపై రెడ్ కో, విద్యుత్తు,పంచాయతి రాజ్ తదితర శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..నాణ్యతా ప్రమాణాలతో ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.

టిజిఎన్పిడిసిఎల్ పరిధిలోని క్లస్టర్-3 కింద కాటారం గ్రామంలో మొత్తం 700 గృహాలకు 1,400 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రతి ఇంటికి 2 కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ రూఫ్‌టాప్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నామని,  ఈ ప్రాజెక్టును కేంద్రీయ భండార్, హైదరాబాద్ సంస్థ 180 రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపారు. సాంకేతిక ప్రమాణాలు ప్రాజెక్టు నిబంధనలకు అనుగుణంగా మాడ్యూల్  వినియోగించాలని స్పష్టం చేశారు. ప్రతి మాడ్యూల్‌పై తయారీ వివరాలతో కూడిన ఆర్ ఎఫ్ ఐ డి (RFID) ట్యాగింగ్ తప్పనిసరి చేయాలని అన్నారు. గుడిసెలు మరియు ఎత్తైన నిర్మాణాలపై సోలార్ ప్లాంటు ఏర్పాటుకు అనుమతి   లేదని తెలిపారు.ప్లాంట్ స్థాపన అనంతరం 5 సంవత్సరాల పాటు ఉచిత నిర్వహణ  అందించాల్సి ఉందని, సమస్యలు తలెత్తితే 72 గంటల్లో పరిష్కరించాలని తెలిపారు.  పనుల పురోగతి

రెడ్ కో మరియు టిజిఎన్ పిడిసిఎల్ నివేదికల ప్రకారం కాటారంలో ఇప్పటివరకు 334 గృహాల సర్వే పూర్తి కాగా 110 ఇళ్ల రూఫ్‌టాప్స్ గుర్తించారని, 99 గృహాలకు మెటీరియల్ ఏర్పాటు జరిగినట్లు తెలిపారు. సౌర విద్యుత్ వినియోగం ద్వారా ఉచితంగా  విద్యుత్ ఇవ్వడమే  కాకుండా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుందని తెలిపారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ ప్రాజెక్టును విజయవంతం చేయాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, రెడ్ కో డిఎం రాజేందర్, విద్యుత్ శాఖ ఎస్ ఈ రమేష్, డిపిఓ శ్రీలత పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -