Saturday, July 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలి 

రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలి 

- Advertisement -

•మండల వ్యవసాయ అధికారి సాహస్ 
నవతెలంగాణ-మర్రిగూడ 
ఎల్ ని నో ప్రభావంతో వర్షాలు తగ్గుముఖం పడుతున్న కారణంగా మండల రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలని మండల వ్యవసాయ అధికారి సాహస్ రైతులకు సూచించారు.శనివారం మండలంలోని సరంపేట గ్రామంలో వ్యవసాయంపై ఎల్ ని నో ప్రభావం పై వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన పత్తి పంటల సాగులో చీడపీడల నివారణ పద్ధతులను రైతులకు వివరించారు.వర్షాభావ పరిస్థితులలో రెండు శాతం యూరియా సొల్యూషన్ స్ప్రే చేసినచో కొంత మేర ఉపశమనం లభిస్తుంది అని అందుకు ఆరుతడి పంటలైన కొర్రలు,జొన్నలు,మినుములు,పెసర్లు,కందులు, పొద్దుతిరుగుడు వంటి తక్కువ నీటితో సాగయ్యే పంటలు వేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సరంపేట సర్పంచ్ నక్క రాములమ్మ రవి,దామెర భీమనపల్లి ఏఈవో బి.శివ కుమార్ రైతులు దామెర రవి,నక్క నరసింహ,దామెర యాదయ్య,బుర్ర సైదులు,కమ్మరి నారాయణ,దామెర లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -