Sunday, July 26, 2026
E-PAPER
Homeఎడిట్ పేజి‘‘మా సమయం వృథా చేయొద్దు’’

‘‘మా సమయం వృథా చేయొద్దు’’

- Advertisement -

మేము దివి నుంచి దిగివచ్చిన వాళ్లకోసం
మా అమూల్యమైన సమయాన్ని
మామిడి తోరణాల్లో దూర్చి
స్వాగత సంగీతాలు కూర్చి
పవిత్రం చేసుకుంటాం
నేలబారు మనుషులు
మా సమయాన్ని వృధా చేయవద్దు
మేము మామూలు మనుషుల మెడలకు
బిగిసిన సంకెళ్లను విడదీయలేం
విద్యార్థుల భవిష్యత్తు మీద పడుతున్న
గొడ్డలి దెబ్బల గురించి
మమ్మల్నేమి అడగకండి
రోడ్డు మీదికి వచ్చిన ఆకలికేకల
పేగులు పాడే పేదింటి పాటను
మేము పెద్దగా పట్టించుకోము
మేమసలే బిజీబిజీ
పెద్దల అధికారాన్ని చెలాయించటానికి
అవాంతరం వాటిల్లిందా చెప్పండి
తక్షణం న్యాయద్వారాలను తెరుస్తాం
ప్రశ్నలను చంకనేసుకొని
వస్తానంటే మాత్రం
మేమొప్పుకోము గాక ఒప్పుకోము
మీ మీద అన్యాయం జరిగినా సరే
మేం కొంచెం బిజీగా ఉన్నాం
మీరు చూపే ఆధారాలు పరిశీలించలేం
మీ దారేదో మీరు చూసుకోండి
మేమసలే యమా బిజీ
మా సమయం వృధా చేయొద్దు
తోకల రాజేశం, 9676761415

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -