Sunday, July 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమోకాళ్లపై నిలబెట్టారు

మోకాళ్లపై నిలబెట్టారు

- Advertisement -

నిరంకుశ పాలనపై 
సినీనటుడు ప్రకాశ్‌‌రాజ్‌ సీజేపీకి అభినందనలు
నవతెలంగాణహైదరాబాద్
ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉందనే విషయాన్ని ఈ పోరాటం నిరూపించింద‌నీ, నిరంకుశ
పాలనను సైతం మీరు మోకాళ్లపైకి తీసుకురాగలరని నిరూపించారు.’’ అని సినీనటుడు ప్రకాశ్‌రాజ్
పేర్కొన్నారు. తనదైన శైలిలో నిలదీస్తూ, ప్రశ్నించేతత్వం తో ముందుకు సాగే ప్రకాష్ రాజ్ తాజాగా న్యూఢిల్లీలో యువత సాధించిన విజయంపై ఎక్స్ వేదికగా స్పందించారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామా చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ సోనమ్ వాంగ్‌చుక్ నేతృత్వంలో సాగిన పోరాటా న్ని, దానికి మద్దతుగా నిలిచిన యువతకు ఆయన అభినందనలు తెలియజేశారు. “నా ప్రియమైన ‘కాక్రోచ్‌’ (బొద్దింకలు) కి నా అభినందనలు.. ప్రియమైన సోనమ్ వాంగ్‌చుక్‌ ‌కు , యువత పక్షాన నిలబడిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. నిరంకుశ పాలనను సైతం మీరు మోకాళ్లపైకి తెప్పించగలరని నిరూపించారు.’’ అని పేర్కొన్నారు. ప్రకాష్ రాజ్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -