– టీజీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జీఎస్ నారాయణ
నవతెలంగాణ-సత్తుపల్లి
ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో తక్షణమే విలీనం చేయాలని టీజీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జీఎస్ నారాయణ డిమాండ్ చేశారు. సత్తుపల్లి డిపోలో టీజీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం ఆదివారం డిపో అధ్యక్షుడు రాంబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి నారాయణ పాల్గొని ప్రసంగించారు.
ఆర్టీసీని పూర్తిస్థాయిలో ప్రభుత్వంలో విలీనం చేసి, కార్మికుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి పిల్లి రమేష్ మాట్లాడుతూ 2017, 2021 పీఆర్సీ బకాయి అలవెన్సులను తక్షణమే విడుదల చేయాలని, కారుణ్య నియామక కార్మికులను రెగ్యులర్ చేయాలని కోరారు. అనంతరం డిపో నూతన అడ్హాక్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
గౌరవ అధ్యక్షుడిగా దండు ఆదినారాయణ, అధ్యక్షుడిగా రాంబాబు వర్కింగ్ ప్రెసిడెంట్ డి. కృష్ణ చైర్మన్ చెన్నారావు, కార్యదర్శి ఎన్ఆర్ కృష్ణ, మహిళా కార్యదర్శి జానకి, కోశాధికారిగా రవిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు బాలరావు, రఘురాం, రాజేష్, రమాదేవి పాల్గొన్నారు.



