Sunday, July 26, 2026
E-PAPER
Homeఖమ్మంప్రతి ఓటరు ఈఎఫ్ పూర్తి చేయాలి

ప్రతి ఓటరు ఈఎఫ్ పూర్తి చేయాలి

- Advertisement -

– మండలంలో ఎస్‌ఐఆర్ పరిశీలన
– మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్ జూపల్లి రమేష్ బాబు
నవతెలంగాణ – అశ్వారావుపేట

మండలంలోని ప్రతి ఓటరు బీఎల్‌వోలు అందజేసిన ఎన్రోల్మెంట్ ఫారాన్ని (ఈఎఫ్) పూర్తిగా నింపి తిరిగి అందజేసి తమ ఓటు నమోదును పునరుద్ధరించుకోవాలని అశ్వారావుపేట మున్సిపాలిటీ వైస్ ఛైర్‌పర్సన్ జూపల్లి రమేష్ బాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఆదివారం ఆయన మండలంలోని నారాయణపురం, గుమ్మడివల్లి తదితర గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను పరిశీలించారు. ఓటర్ల నమోదు, ఎన్రోల్మెంట్ ఫారాల పంపిణీ, సేకరణ తదితర అంశాలపై సంబంధిత బీఎల్‌వోలు, బూత్ ఏజెంట్లతో మాట్లాడి ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సత్యనారాయణ, సోషల్ మీడియా ఇన్‌చార్జి చీకటి శ్రీనివాసరావు, నాయకులు ప్రమోద్, పద్మశేఖర్, వేల్పుల సత్యనారాయణ, సంబంధిత గ్రామాల సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, బూత్ ఏజెంట్లు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -