- Advertisement -
ఆకాశాన్ని
ఖాళీ చేసిన నక్షత్రాలు
ఢిల్లీ వీధుల్లో మెరిసాయి!
యువ తేజానికి
లాఠీల కళ్ళు బైర్లు కమ్మినై
నిరాయుధులపై యుద్ధం!
విరుగుతున్న ఒక్కోలాఠీ దెబ్బకు
వేల గొంతుకల్లోంచి
నినదించిన వందేమాతరం!
మహాత్ముని వారసత్వం
అమరమని అజేయమని
అహింసే బ్రహ్మాస్త్రమని మరోసారి రూఢీ!
వెన్నెముకలు ఒక్కొక్కటి
పటపటమని విరుగుతున్నా
నహీ చెలేగా నహీ చెలేగా ఒకటే నినాదం!
మన వాడే మనతో యుద్ధం
మిత్రో! చూస్తూ ఉండండి
ఎర్రకోట ఇప్పుడు ఎరుపెక్కనుంది!!
కోట్ల వెంకటేశ్వర రెడ్డి, 94402 33 261
- Advertisement -



