Monday, July 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమావోయిస్టులు మళ్లీ హల్‌‌చల్‌

మావోయిస్టులు మళ్లీ హల్‌‌చల్‌

- Advertisement -

30 వరకు గడ్చిరోలి
జిల్లా బందుకు పిలుపు

ప్రభుత్వ కార్యాలయాలు, రహదారుల నిర్బంధం
హిదుర్-డోబుర్ రహదారిపై బ్యానర్లు

నవతెలంగాణ-చర్ల
కర్రెగుట్టల ఆపరేషన్‌‌తో మావోయిస్టులు తుద ముట్టించామని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిన చాలా కాలం తర్వాత సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌-మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా దండకారణ్యంలో మావోయిస్టులు మళ్లీ హల్చల్ చేశారు. ఇటు ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యం అటు మహారాష్ట్ర అరణ్య సరిహద్దులో గల గడ్చిరోలి జిల్లాభామ్రాగడ్‌లో తిరిగి మావోయిస్టులు తమ కార్యకలాపాలను ప్రారంభించారు. హిదుర్-డోబుర్ రహదారిపై బ్యానర్లు ఏర్పాటు చేసి ఈ నెల 26 నుంచి 30 వరకు జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు. ఆదివారం భామ్రాగడ్ తాలూకాలోని హిదుర్-డోబుర్ ప్రధాన రహదారిపై మావోయిస్టుల బ్యానర్లు, కరపత్రాలు కనిపించడంతో భద్రతా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ కరపత్రాల ద్వారా జిల్లా బంద్‌కు పిలుపునివ్వడంతో పాటు, నీరు, అటవీ, భూమి సమస్యలపై నిరసన తెలపాలని కోరారు. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. కరపత్రాలు, బ్యానర్లను ఎవరు ఏర్పాటు చేశారనే దానిపై విచారణ కొనసాగుతోంది. ఏదేమైనా ఛత్తీస్ గఢ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో మావోయిస్టు పార్టీ మళ్లీ పుంజుకోడానికి సంసిద్ధమవుతున్నట్టు విశ్వసనీయ సమాచారం అందుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -