- Advertisement -
నవతెలంగాణ – ఊరుకొండ
ఊరుకొండ మండల కేంద్రానికి చెందిన పోలే లక్ష్మమ్మ(56) ప్రమాదవశత్తు జరిగిన రోడ్డు ప్రమాదంలో సోమవారం మృతి చెందింది. స్థానిక కాంగ్రెస్ నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డితోపాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ నాయకులు లక్ష్మమ్మ మృతదేహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, బాధిత కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు.
- Advertisement -



