Monday, July 27, 2026
E-PAPER
Homeఆదిలాబాద్ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి

ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి

- Advertisement -

నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
ప్రజల సమస్యలను బాధ్యతగా స్వీకరించి, ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 28 మంది ఫిర్యాదుదారుల నుంచి ఎస్పీ నేరుగా వినతులు స్వీకరించారు. ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, ప్రతి ఫిర్యాదుపై చట్టపరంగా వేగవంతమైన చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా అందిన ఫిర్యాదుల్లో కుటుంబ వివాదాలు, భార్యాభర్తల సమస్యలు, మోసాలకు సంబంధించిన కేసులు, దర్యాప్తు అంశాలు, తల్లిదండ్రుల సమస్యలు తదితర అంశాలు ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు, చట్టవ్యతిరేక చర్యలు లేదా ప్రజా శాంతిభద్రతలకు భంగం కలిగించే సంఘటనలు గమనించిన వెంటనే జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 8712659973 వాట్సాప్ నంబర్‌కు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీసీ కొండ రాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారి జైస్వాల్ కవిత, సిబ్బంది సునీల్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -