Monday, July 27, 2026
E-PAPER
Homeసినిమానవ్వుతూనే ఉంటారు

నవ్వుతూనే ఉంటారు

- Advertisement -

హీరో వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’గా రాబోతున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్నారు. ఆగస్టు 7న ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా హీరోయిన్ రితిక నాయక్ మీడియాతో ముచ్చటించారు. ఇందులో నేను చేసిన పాత్రకు, నా వ్యక్తిత్వానికి కూడా కొన్ని పోలికలు ఉన్నాయి. ఇది కేవలం కమర్షియల్ పాత్ర మాత్రమే కాదు. చాలా డిఫరెం ట్‌గా ఉంటుంది. ప్రేక్షకులు కూడా నా పాత్రకు బాగా కనెక్ట్ అవుతారని నమ్ముతున్నాను. ఇప్పటివరకు నేను ఇలాంటి పాత్ర చేయలేదు. ఇం దులో నేను సెల్ఫ్ ఇండిపెండెంట్, చాలా మోడరన్ అమ్మాయిని.
ఈ సినిమా కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుంది. హారర్ కామెడీలు చాలా వచ్చినప్పటికీ, ఇందులోని కథ, ఇండియన్-కొరియన్ కల్చర్స్ అంశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయి.
వరుణ్ తేజతో కలిసి పని చేయడం మంచి ఎక్స్‌పీరియన్స్. ఆయన పాత్ర బాగుంటుంది. సత్య, వీటీవీ గణేష్, బుల్లిరాజు ఇలా చాలా మంచి హాస్య నటులు ఇందులో ఉన్నారు. ప్రేక్షకులు థియేటర్‌లో కడుపుబ్బా నవ్వుకుంటారు.
యూవీ క్రియేషన్స్‌తో పని చేయడం చాలా మంచి ఎక్స్ పీరియన్స్. తమన్ ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్ ఇచ్చారు. పాటలన్నీ ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. ఇందులో నేను తొలిసారి డాన్స్ చేశాను.
సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. చూస్తున్నంతసేపూ నేను నవ్వుతూనే ఉన్నాను. ప్రేక్షకులు కూడా అదే స్థాయిలో ఎంటర్‌టైన్ అవుతారని నమ్ముతున్నాను. ఇకపై కూడా మంచి పాత్రలకే ప్రాధాన్యత.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -