Tuesday, July 28, 2026
E-PAPER
Homeఆటలుఇషా సింగ్‌‌ పసిడి గురి

ఇషా సింగ్‌‌ పసిడి గురి

- Advertisement -

మను భాకర్‌‌కు కాంస్య పతకం
ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌
హాంగ్జౌ (చైనా) :
భారత స్టార్‌ ‌షూటర్‌, తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్‌ మరోసారి పసిడి గురితో మెరిసింది. చైనాలోని హాంగ్జౌలో జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ‌షూటింగ్‌ ‌ప్రపంచకప్‌‌లో ఇషా సింగ్‌ ‌బంగారు పతకం సాధించింది. ఇటీవల మ్యూనిచ్‌‌లో జరిగిన ప్రపంచకప్‌‌లో వరల్డ్‌ ‌రికార్డు నెలకొల్పిన ఇషా సింగ్‌ ‌అదే జోరులో మరో స్వర్ణం ఖాతాలో వేసుకుంది. సోమవారం జరిగిన మహిళల 25మీటర్ల పిస్టల్‌ ‌విభాగంలో ఇషా సింగ్‌ 40 ‌హిట్స్‌‌తో అగ్రస్థానంలో నిలిచింది. చైనా షూటర్‌ ‌జాంగ్‌ 37 ‌హిట్స్‌‌తో రెండో స్థానంలో నిలువగా.. డబుల్‌ ఒలింపిక్‌ మెడలిస్ట్‌ ‌మను భాకర్‌ 28 హిట్స్‌‌తో కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. ఒకే ఈవెంట్‌‌లో రెండు పతకాలు రావటంతో హాంగ్జౌ ప్రపంచకప్‌‌లో భారత్‌ ‌పతకాల సంఖ్య 3కు చేరుకుంది. భారత్‌ ఓ పసిడి, ఓ రజతం సహా కాంస్య పతకం దక్కించుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -