వెయిట్‌లిఫ్టింగ్‌లో రజత పతకం
గ్లాస్గో 2026 కామన్వెల్త్ క్రీడలు
గ్లాస్గో (స్కాట్లాండ్) : 2026 గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో భారత్ మరో పతకం సాధించింది. వెయిట్‌లిఫ్టింగ్‌లో ఇప్పటికే మీరాబాయి చాను, రిషికాంత సింగ్‌లు సత్తా చాటగా.. సోమవారం జరిగిన పోటీల్లో జ్ఞానేశ్వరి యాదవ్ మెరిసింది. మహిళల 53 కేజీల విభాగంలో జ్ఞానేశ్వరి యాదవ్ సిల్వర్ మెడల్ సాధించింది. స్నాచ్ విభాగంలో 88 కేజీలు ఎత్తిన జ్ఞానేశ్వరి .. క్లీన్ అండ్ జెర్క్‌లో 111 కేజీలు ఎత్తి పడేసింది. ఓవరాల్‌గా 199 కేజీలు బరువు అవలీలగా ఎత్తిన జ్ఙానేశ్వరి యాదవ్ రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది. నైజీరియా అమ్మాయికి స్వర్ణం దక్కగా, కెనడా వెయిట్‌లిఫ్టర్ కాంస్య పతకం కైవసం చేసుకుంది.
వెండి కొండ జ్ఞానేశ్వరి
- Advertisement -
- Advertisement -



