కేంద్రమంత్రి భూపెంద్ర యాదవ్ మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ విజ్ఞప్తి
నవతెలంగాణ – మల్హర్ రావు
కేంద్ర పర్యావరణ, అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ను తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డా.జి.వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో వారు కేంద్రమంత్రితో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సింగరేణి సంస్థకు కేటాయించిన తాడిచర్ల బ్లాక్-2 ప్రాజెక్టుకు అవసరమైన పర్యావరణ అనుమతులను అత్యవసరంగా మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. ఈ ప్రాజెక్టు ప్రారంభమైతే స్థానిక యువతకు వెయ్యి మందికి పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు లభించడంతో పాటు ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని వివరించారు. దీనిపై కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ సానుకూలంగా స్పందిస్తూ.. సంబంధిత అధికారులతో సమీక్షించి, అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
తాడిచర్ల బ్లాక్-2కు పర్యావరణ అనుమతులివ్వాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



