నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ గ్రామంలోని సమస్యలను వెంటనే పరిష్కరించి, గ్రామాన్ని పరిశుభ్రం చేయడమే తమ లక్ష్యమని గ్రామ సర్పంచ్ కర్రేవార్ సావిత్రి సాయగౌడ్ అన్నారు. మంగళవారం ఆయన గ్రామంలో నిర్వహిస్తున్న పారిశుద్ధ్య పనులను వీధివీధి తిరిగి పరిశీలించారు. రోడ్డుకిరువైపుల పేరుకుపోయిన చెత్తను, పిచ్చిమొక్కలను తొలగించి, ట్రాక్టర్లో కంపోస్ట్ షెడ్డుకు తరలించామన్నారు. దోమల నివారణకు గడ్డి మందులు పిచికారి చేశామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జుక్కల్ సర్పంచ్ సావిత్రి సాయగౌడ్, వార్డు సభ్యులు సజ్జన్ వార్ సాయినాథ్, గంగాధర్, గ్రామ యువకులు బొంపెల్లివార్ విజయ్ కుమార్, బాలాజీ, జుక్కల్ గ్రామ పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్ గౌడ్, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జుక్కల్ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యం: సర్పంచ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



