Tuesday, July 28, 2026
E-PAPER
Homeఆదిలాబాద్విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు: ఎంపీడీఓ 

విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు: ఎంపీడీఓ 

- Advertisement -

నవతెలంగాణ-కుభీర్
విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఎంపీడీవో అక్కంపల్లి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మండలంలోని జుమడా గ్రామ పంచాయతీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో గ్రామస్తులు గ్రామపంచాయతీలో పారిశుద్ధ్య పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయని ఆయనకు ఫిర్యాదు చేశారు. దీంతో గ్రామమంతా ఆయన కలియ తిరిగి పరిశీలించారు. జుమడా గ్రామ పంచాయతీ పరిధిలో రాజురా గ్రామం కూడా ఉంది. ఇందులో ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నట్టు తెలుసుకున్నారు. గ్రామంలో మురికి కాలువల్లో ఊడికతీత తీయకపోవడంతో మురుగు నీరు రోడ్లపై ప్రవహించడం, మధ్యాహ్నం వేళ వీధి దీపాలు వెలగడం కనిపించాయి.

అనంతరం ఎంపీడీఓ మాట్లాడుతూ.. గ్రామంలో పారిశుద్ధ్యం పూర్తిగా లోపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మురుగునీరుతో గ్రామమంతా దుర్వాసన వెదజల్లుతోందని, దీనివల్ల గ్రామస్తులకు సీజనల్ వ్యాధులు వ్యాపించి, రోగాల బారిన పడే ప్రమాదం పొంచి ఉందని చెప్పారు. ఆలస్యం చేయకుండా రేపటికల్లా మురికి కాలువలన్నీ పూర్తిగా శుభ్రం చేసేలా చూడాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. పగటిపూట వీధిదీపాలు వెలుగుతుంటే మీరేం చేస్తున్నారని కార్యదర్శికి చురకలు అంటించారు. ప్రాథమీక, అంగన్ వాడీ కేంద్రాలను సందర్శించి, విద్యార్థుల సంఖ్య మరింత పెరిగేలా చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. అదేవిధంగా గ్రామపంచాయతీ రికార్డులను క్షణ్ణంగా పరిశీలించారు. జీపీ సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి బి రమేష్, గ్రామస్తులు, తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -