- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
వరికి బదులుగా ఆరుతడి పంటలు రైతులు సాగు చేయాలని మండల వ్యవసాయ అధికారిణి భాను శ్రీ రైతులకు సూచించారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం రైతు నేస్తం 100వ ఎపిసోడ్ ను అధికారులు, రైతులు వీక్షించారు. అనంతరం ఎల్ నినో పరిస్థితుల వల్ల ఆరుతడి పంటలు సాగు చేయాలని విత్తన మేళ నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచులు బండి ప్రవీణ్, డోకి లచ్చయ్య, సుద్దాల లింగం, మహేష్ , ఏ ఈ ఓ లు రాకేష్, బబిత, రైతులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



