Tuesday, July 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రతి ఇంట్లో పండ్ల చెట్లు పెంచాలి: సర్పంచ్

ప్రతి ఇంట్లో పండ్ల చెట్లు పెంచాలి: సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ-మిడ్జిల్
ప్రతి ఇంటిలో పండ్ల చేట్లను నాటాలని, నాటిన చెట్లను పెంచే బాధ్యత మహిళలే తీసుకోవాలని సర్పంచ్ శ్రీశైలం యాదవ్ చెప్పారు. మంగళవారం మండలంలోని మసిగుండ్లపల్లి గ్రామంలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా పాలెం అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి తీసుకువచ్చిన నాణ్యమైన పండ్ల విత్తనాలు గ్రామపంచాయతీ నర్సరీలో పెంచి ఉప సర్పంచ్ బర్రె జనార్ధన్ తో కలిసి మహిళా సంఘ సభ్యులకు మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీశైలం యాదవ్ మాట్లాడుతూ.. ప్రతి ఇంటిలో అన్ని పండ్ల చెట్లు పెంచుకోవాలని, పండ్లు తింటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. చెట్లను పెంచితే వర్షాలు సమృద్ధిగా వస్తాయని మహిళా సంఘ సభ్యులు చెట్ల నాటే కార్యక్రమంలో భాగస్వాములై ఉండాలని కోరారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మధు కుమార్, మహిళా సంఘాల సభ్యులు, ఫీల్డ్ అసిస్టెంట్ గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -