Tuesday, July 28, 2026
E-PAPER
Homeతాజా వార్తలుహైడ్రా మేము తీసుకొచ్చిన అతిపెద్ద సంస్కరణ

హైడ్రా మేము తీసుకొచ్చిన అతిపెద్ద సంస్కరణ

- Advertisement -
  • సీఎం రేవంత్ రెడ్డి

నవతెలంగాణ-హైదరాబాద్: హైడ్రా మేము తీసుకొచ్చిన అతిపెద్ద సంస్కరణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం మీడియాతో మాట్లాడారు. ఏ అధికారిని నియమించాలనే విచక్షణ  రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. బిఆర్ఎస్ నేతలు దురుద్దేశంతో కేసులు వేసి కోర్టును తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. కోర్టు తీర్పుని పరిశీలించి తదుపరి కార్యాచరణ రూపొందిస్తాం. హైడ్రా కార్యాచరణ పైన తమకు పూర్తి స్పష్టత ఉంది. డబ్బులు పెట్టి సోషల్ మీడియాలో హైడ్రా పై  తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కబ్జా కోర్లే హైడ్రా వద్దంటున్నారని, గండిపేట బతుకమ్మ కుంటలను ఆక్రమించింది పేదల పెద్దలా? అని ప్రశ్నించారు. కబ్జా కోర్లకు మీడియా కూడా సహకరించకూడదన్నారు రేవంత్‌. హైడ్రా పనులు కొనసాగించి తీరుతామని రేవంత్‌ స్పష్టం చేశారు.

సోమవారం హైడ్రా కమిషనర్‌గా రంగనాథ్‌ను తొలగించాలని హైకోర్టు ఆదేశాల జారీ చేసిన విషయం తెలిసిందే. 63 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయని, పదే పదే కోర్టు తీర్పులను ఉల్లంఘించడం చట్టాన్ని ఆతిక్రమించడమేనని కోర్టు పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -