– పిఆర్టియు మండల శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు..
నవతెలంగాణ – తొగుట
జన జాగరణ చైతన్య మహా సభను జయ ప్రదం చేయాలని పిఆర్టియు మండల శాఖ అధ్యక్షు లు పి. రామచంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి బి. సురేం దర్ రెడ్డి అన్నారు. మంగళవారం టిఎస్సీపి ఎస్ఈయు తొగుట మండల శాఖ అధ్యక్షులు బొంగురం రాజేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్ నాయకత్వంలో సీపీఎస్ ఉద్యోగుల జన జాగరణ పోస్టర్ ఆవిష్కరణ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జూలై 30 వ తేదీ మధ్యా హ్నం నుండి సిద్దిపేట జిల్లా కేంద్రంలో మహా సభ నిర్వహిస్తామన్నారు. ఈ జన జాగరణ యాత్ర చైతన్య మహా సభ ను జయప్రదం చేయాలని కోరారు. ఈ మహా సభకు అధిక సంఖ్యలు ఉద్యోగ ఉపాధ్యాయులు పాల్గొనీ జయప్రదం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మహ మ్మద్ సమీర్ హమ్మద్ ఖాన్, ఎంఈఓ నర్సయ్య, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయసంఘాల నాయకులు రాములు, రాజేశం, మల్లేశం, ఉపాధ్యాయులు సిపిఎస్ ఉద్యమానికి మద్దతు తెలిపారు.
జన జాగరణ చైతన్య యాత్ర మహా సభను జయప్రదం చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



