– భవిష్యత్తును దోచుకుంటున్న పాలకులపై ఉద్యమిద్దాం
– సీపీఐ హుస్నాబాద్ నియోజకవర్గ కన్వీనర్ జగీర్ సత్యనారాయణ
నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్
బీజేపీ నిరంకుశ విధానాలు దేశానికి ప్రమాదకరమని, యువత భవిష్యత్తును దోచుకుంటున్న పాలకులపై ఉద్యమించాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఎఐవైఎఫ్) మాజీ రాష్ట్ర నాయకులు సీపీఐ హుస్నాబాద్ నియోజకవర్గ కన్వీనర్ జాగీర్ సత్యనారాయణ అన్నారు. మంగళవారం సిపిఐ కార్యాలయంలో ఎఐవైఎఫ్ అఖిల హుస్నాబాద్ అక్కన్నపేట మండలాల భారత యువజన సమాఖ్య మహాసభ ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు బిచ్చాల శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. యువత నేడు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్నారు. నిరుద్యోగం, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో జాప్యం, కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్ విధానాలు, పరిశ్రమల కొరత, నైపుణ్యాభివృద్ధి అవకాశాల లేకపోవడం, రైతు కుటుంబాల యువత ఇబ్బంది పడుతున్నారన్నారు.
ప్రభుత్వ విద్య వైద్య రంగాల నిర్లక్ష్యం, వంటి సమస్యలు యువత భవిష్యత్తును చీకటిలోకి నెట్టుతున్నాయన్నారు. ప్రజల పన్నులతో నడవాల్సిన ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేసి, కార్పొరేట్ ప్రయోజనాల కోసం యువత జీవితాలతో చెలగాటమాడుతున్నయన్నారు. పాలకులపై యువజనులుగా పోరాటం చేయాలన్నారు . అభివృద్ధి అంటే కేవలం ప్రకటనలు కాదని, శాశ్వత ఉద్యోగాల కల్పనతోనే సాధ్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలోమాజీ వైస్ఎ ఎంపీపీ గడిపే మల్లేశ్ , ఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు జనగాం రాజ్ కుమార్ ,ఎఐవైఎఫ్ నాయకులు మేడవేణి చిరంజీవి, జాగిరి సాయి కృష్ణ, భూక్యా గణేష్, దొంతరబోయిన రజిత కార్యకర్తలు పాల్గొన్నారు.



