- Advertisement -
నవతెలంగాణ – మర్రిగూడ
ఇటీవల జాతీయ ఉత్తమ సర్పంచ్ అవార్డు అందుకున్న రాంరెడ్డి పల్లి సర్పంచ్ లపంగి నరసింహను మంగళవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో జిసి మున్నయ్య ఆధ్వర్యంలో మండల అధికారులు శాలువతో ఘనంగా సన్మానించి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ భీమనపల్లి వేణుగోపాల్, ఎంపీఓ రవికుమార్, ఏపిఎం అద్దంకి వెంకట్, ఏపీవో జయరాజు,ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



