Tuesday, July 28, 2026
E-PAPER
Homeజిల్లాలుఆన్సాన్పల్లి-గొర్లవీడు రోడ్డు బురదమయం..

ఆన్సాన్పల్లి-గొర్లవీడు రోడ్డు బురదమయం..

- Advertisement -

బురద రోడ్డుపై ప్రజలు జారిపడుతున్నా పట్టించుకోరా.?
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఆన్సాన్పల్లి గ్రామ పరిధిలో గల లంబాడి తండా నుండి గొర్లవీడు వెళ్ళు ప్రధాన రహదారి చిరుజల్లులతో బురదమయంగా మారడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్తానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం బిఆర్ఎస్ పార్టీ నాయకుడు బానోతు రాజ్ మాట్లాడుతూ..బురదలో వెళ్లలేక వాహనాలతో పాటు ప్రజలు జారిపడిపోతున్నా స్థానిక పాలకులు, అధికారులు పట్టించుకోరా అని ప్రశ్నించారు. కాలినడకన వెళ్ళేవారికి కూడా ఈ రోడ్డు సౌకర్యంగా లేదని ఆయన వాపోయారు. ఈ దారిలో నిత్యం వందల మంది రాకపోకలు సాగిస్తారని గుర్తు చేశారు. ఇప్పటికే పలుమార్లు గ్రామ సభల్లో ఇదే అంశంపై పాలకవర్గానికి, గ్రామ కార్యదర్శికి నేరుగా తెలియజేశామనీ, సభల్లో రాసుకోవడమే తప్పా చేతల్లో ఎలాంటి మరమ్మత్తులు, కార్యచరణకు నోచుకోవడం లేదని, జీపీ కార్యదర్శి, పాలకవర్గం నిద్రపోతుందా అని మండిపడ్డారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కల్పించుకుని బురదమయంగా మారిన రోడ్డుపై దృష్టి సారించి మరమ్మతులు చేపట్టాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -