నవతెలంగాణ – రాయపోల్
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాయపోల్ మండలం లింగారెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. రాయపోల్ పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కుసంబి సంతోష్ (42) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. కాగా ఇటీవల మద్యానికి బానిసై గ్రామంలో కొంతమంది దగ్గర అప్పులు చేశాడు. ఇదే విషయమై భార్య అనిత సోమవారం మందలించగా ఇద్దరు గొడవపడ్డారు. అదే కోపంతో మధ్యాహ్నం ఇంట్లో నుంచి వ్యవసాయ పొలం వద్దకు వెళ్ళిపోయాడు. అక్కడే పురుగుల మందు తాగాడు. గమనించిన స్థానికులు సమాచారం కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో, చికిత్స నిమిత్తం హుటాహుటిన గజ్వేల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం వెంటనే మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున సంతోషం మృతి చెందాడు. మృతుడి భార్య అనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రాయపోల్ ఎస్ఐ కె. మానస తెలిపారు.
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



