Monday, September 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వర్షాభావ పరిస్థితుల్లో ఆరుతడి పంటలే శ్రేయస్కరం

వర్షాభావ పరిస్థితుల్లో ఆరుతడి పంటలే శ్రేయస్కరం

- Advertisement -

వ్యవసాయ అధికారి ఎస్. శ్రీనివాస
నవతెలంగాణ – పరకాల 

పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు విధానాన్ని మార్చుకోవాలని రైతులకు సూచిస్తూ పరకాల మండలంలోని కామారెడ్డిపల్లి రైతు వేదికలో మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వరికి బదులుగా ఆరుతడి పంటల సాగు, ఫామ్ పాండ్‌ల ప్రాముఖ్యతపై రైతులకు వ్యవసాయ అధికారులు వివరించారు. ఈ సందర్భంగా పరకాల మండల వ్యవసాయ అధికారి ఎస్. శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అధిక నీరు అవసరమయ్యే వరి పంటకు బదులుగా కంది, పెసర, మినుము, జొన్న, సజ్జ వంటి ఆరుతడి పంటలను సాగు చేయడం ద్వారా రైతులు నష్టాలను తగ్గించుకోవచ్చన్నారు. వర్షపు నీటిని సద్వినియోగం చేసేందుకు రైతులు తమ పొలాల్లో ఫామ్ పాండ్‌లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఫామ్ పాండ్‌ల ద్వారా వర్షపు నీటిని నిల్వ చేసి అవసరమైన సమయంలో పంటలకు వినియోగించుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి అహ్మద్ రజా, గ్రామ సర్పంచ్ చిర్రా అనిత రాజయ్య, ఉపసర్పంచ్ సీపతి మౌనిక తిరుపతి, పంచాయతీ కార్యదర్శి, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -