- Advertisement -
నవతెలంగాణ -పెద్దవంగర
గంట్లకుంట గ్రామ చెరువు కట్టపై ఇరువైపులా కంప చెట్లు విస్తారంగా పెరగడంతో రైతులు, ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో చెట్లు మరింత విస్తరించి దారి ఇరుకుగా మారడంతో వ్యవసాయ భూములకు వెళ్లే రైతులకు రాకపోకలు కష్టంగా మారాయి. ప్రమాదాలు జరగకముందే ఇరిగేషన్ అధికారులు స్పందించి చెరువు కట్టపై ఉన్న కంప చెట్లను తొలగించాలని రైతులు, గ్రామస్థులు కోరుతున్నారు.
- Advertisement -



