Wednesday, July 29, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలులీక్‌ నిందితుల్ని శిక్ష‍ించాలి

లీక్‌ నిందితుల్ని శిక్ష‍ించాలి

- Advertisement -

కోచింగ్‌ ‌సెంటర్లపై దేశవ్యాప్త విధానం ఉండాలి
యూనివర్సిటీలపై కేంద్రం ఆధిపత్యం వద్దు
‘విద్య’ రాష్ట్రాల పరిధిలోనే ఉండాలి
కేంద్రం దాన్ని గుంజుకునే ప్రయత్నాలు మానాలి
గ్లోబ‌రీనా అక్ర‌మాలు సీబీఎస్ఈకీ విస్త‌రించాయి
కేసీఆర్ పెట్టిన ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ బకాయిలు రూ.8 వేల కోట్లు
హైడ్రాపై హైకోర్టు ఉత్తర్వులను సమీక్షిస్తాం
అధికారుల నియామకం రాష్ర్ట ప్రభుత్వ విచక్షణాధికారం
ఢిల్లీలో మీడియాతో సీఎం ఏ రేవంత్ రెడ్డి

11.56 లక్షల ఇండ్లు ఇవ్వండి
వీబీ గ్రామ్‌‌జీలో పది కొత్త పనులు చేర్చండి : కేంద్రమంత్రి శివరాజ్‌‌సింగ్‌ చౌహాన్‌‌తో భేటీలో సీఎం రేవంత్‌‌రెడ్డి విజ్ఞప్తి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ప్ర‌శ్న ప‌త్రాల లీకేజీల‌కు కారణమైనవాళ్లను కఠినంగా శిక్షించాల‌ని ముఖ్య‌మంత్రి ఏ రేవంత్ రెడ్డి డిమాండ్‌ ‌చేశారు. పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించినప్పుడు పెద్దగా సమస్యలు లేవ‌ని, ఆఫ్‌లైన్‌లోనే సమస్యలు వస్తున్నాయ‌ని అభిప్రాయపడ్డారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌ను క‌లిసిన అనంత‌రం అక్కడే ఆయన విలేక‌రుల‌తో మాట్లాడారు. అనుమ‌తి లేకుండానే దేశంలో కోచింగ్ కేంద్రాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయ‌ని, అవి ప్రశ్నాపత్రాలు లీక్ అవ్వడానికి వేదికలుగా మారుతున్నాయ‌ని చెప్పారు. దీనిపై జాతీయ స్థాయిలో ఒక విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. యూనివర్సిటీల మీద ఆధిపత్యం చెలాయించాలనే ప్ర‌య‌త్నాన్ని కేంద్ర ప్రభుత్వం మానుకోవాల‌ని హెచ్చరించారు. విద్య‌ను వీలైనంతవరకు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంచితే తప్పిదాలకు అవకాశం త‌క్కువ‌గా ఉంటుంద‌నీ, దీనిపై పార్ల‌మెంట్‌‌లో చర్చ జరగాల్సి ఉంద‌న్నారు. స‌భ‌లో చ‌ర్చ జ‌రిగితే రాహుల్ గాంధీ అన్ని అంశాల‌పై మాట్లాడతార‌ని తెలిపారు. ప్ర‌శ్నాప‌త్రాల లీకేజీల నివార‌ణ‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేసే చ‌ట్టాన్ని చూసిన త‌ర్వాత రాష్ట్రంలో ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటామన్నారు. యూపీఎస్సీ విధానంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేసి నియామకాలు చేపట్టడం వల్లే తాము రాష్ర్టంలో పారదర్శకంగా పరీక్షలను నిర్వహించామ‌ని వివరించారు. విద్యార్థులకు నష్టం వాటిల్ల‌కుండా, వారికి నమ్మకం, విశ్వాసం కలిగించేలా పార‌ద‌ర్శ‌కంగా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. గతంలో ఇంటర్‌ ‌సహా పలు పరీక్షా పేపర్ల లీకేజీలతో సంబంధం ఉన్న గ్లోబరీనా వంటి సంస్థలపై ఆనాటి సీఎం కేసీఆర్‌ ఎలాంటి చర్యలు తీసుకోలేదనీ, దాని ఫలితంగా ఇప్పుడు ఆ అక్రమాలు సీబీఎస్ఈ పరీక్ష‌ల వ‌ర‌కు విస్త‌రించాయని విమర్శించారు. అలాంటి సంస్థల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంద‌న్నారు.


క్షేత్రస్థాయి పరిశీలనకు రండి : కేంద్ర మంత్రికి సీఎం ఆహ్వానం
ఇందిరమ్మ ఇండ్లు, ఉపాధి ప‌నుల విష‌యంలో సమస్యలను కేంద్ర మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్ దృష్టికి తీసుకెళ్లామ‌ని, వాటి ప‌రిష్కారానికి ఆయన సానుకూలంగా స్పందించార‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ‌లో ప‌రిస్థితుల ప‌రిశీల‌న‌కు క్షేత్రస్థాయి పర్యటనకు రావాల‌ని తాను కేంద్ర మంత్రిని ఆహ్వానించానని తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కు సంబంధించి గత కేసీఆర్ ప్రభుత్వం రూ.8వేల కోట్లను బకాయిలను పెట్టి పోయింద‌ని తెలిపారు. ఎలాంటి వసతులు లేకుండా, దొంగ లెక్కలు చూపించి ఫీజు రీయింబర్స్‌మెంట్ కొట్టేయాలనుకునే సంస్థలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ సాగుతోంద‌ని తెలిపారు. స‌క్ర‌మంగా ఉన్న‌వాళ్ల‌కు బ‌కాయిలు చెల్లిస్తామ‌ని ఓ ప్ర‌శ్న‌కు సీఎం బ‌దులిచ్చారు. కేసీఆర్ పెట్టిన బకాయిలే త‌మ‌కు భారంగా మారాయ‌న్నారు. తాము ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడం లేదన్నట్లుగా, తమ ప్రభుత్వం కారణమన్నట్లుగా బీఆర్ఎస్ భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తోంద‌ని, దానికి బీజేపీ వంత‌పాడుతోంద‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు.

​ఏపీలో కోరండి
కూట‌మి ప్ర‌భుత్వం ఉన్న ఆంధ్రప్రదేశ్‌‌లో 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయించిన తర్వాత తెలంగాణలో డిమాండ్ చేస్తే బాగుంటుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ర్ట బీజేపీ అధ్యక్షులు కే రామచందర్‌రావు, ఆర్.కృష్ణయ్యల‌కు సీఎం రేవంత్‌‌రెడ్డి సూచించారు. గత ప్రభుత్వ బకాయిలే త‌మ‌కు భారంగా మారాయ‌ని, అయినా అన్ని స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -