Wednesday, July 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం‌టీవీ రంగంలో రాణిస్తున్న అన్ని కేటగిరీలను ప్రోత్సహించాలి

‌టీవీ రంగంలో రాణిస్తున్న అన్ని కేటగిరీలను ప్రోత్సహించాలి

- Advertisement -

మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

టీవీ రంగంలో రాణిస్తున్న అన్ని కేటగిరీల వారికి,మంచి మెసేజ్ ఇచ్చే సీరియల్స్,ప్రోగ్రామ్స్,చిల్డ్రన్ మూవీలు తీసే వారిని ప్రోత్సహించాలని రాష్ట్ర మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి సూచించారు. మంగళవారం ​
టెలివిజన్ అవార్డు కమిటీ సమావేశంలో ఎఫ్డిసీ ఎండీ ముకుంద రెడ్డి, కమిటి చైర్మెన్, సభ్యులతో కలిసి ఆయన మాట్లాడారు. ఎక్కువ మంది మహిళలు,వృద్ధులు టీవీ కార్యక్రమాల పట్ల మక్కువ చూపుతున్నారని తెలిపారు. కమిటీ సభ్యులు సూచించినట్లు దీనికి పి.వి నరసింహారావు పేరు అంశంపై సీఎంతో చర్చిస్తామని తెలిపారు. ఆయన బహుభాషా కోవిదుడు,తెలంగాణ ఠీవి పి.వి నరసింహారావు, దేశాన్ని ఆర్ధికంగా నిలబెట్టిన గొప్ప మేధావి…అట్లాంటి పేర్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు. కమిటీ వీలైనంత త్వరగా గైడ్‌‌లైన్స్‌, లోగో,అవార్డ్స్ పేరు లాంటివి తయారు చే‌యా లని సూచించారు. ఆ పేరు, లోగోలో తెలంగాణ ఆత్మను ప్రతిబింబించేలా ఉండాలన్నారు. మొట్ట మొదటి సారి ఇవ్వబోయే ఈ అవార్డుల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పారు. పూర్తి పారదర్శకంగా అవార్డులను ఎంపిక చేయాలని కమిటీ చైర్మెన్,సభ్యులకు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -