Wednesday, July 29, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఫారెస్ట్ అధికారుల వేధింపులతో గిరిజన రైతు ఆత్మహత్యాయత్న

ఫారెస్ట్ అధికారుల వేధింపులతో గిరిజన రైతు ఆత్మహత్యాయత్న

- Advertisement -

– బాధితురాలిని పరామర్శించిన సీపీఐ(ఎం) నేతలు
నవతెలంగాణ – కామారెడ్డి

రాజంపేట మండలం షేర్ శంకర్ తండాకు చెందిన సరోజ అనే గిరిజన ఒంటరి మహిళ రైతు మంగళవారం ఉదయం ఫారెస్ట్ అధికారుల వేధింపులు తట్టుకోలేక పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై సీపీఐ(ఎం) నాయకులు మంగళవారం సాయంత్రం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి బాధితురాలిని పరామర్శించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి కే. చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఫారెస్ట్ అధికారి జయశ్రీ వేధింపుల కారణంగానే గిరిజన మహిళ రైతు ఈ దుస్థితికి చేరుకున్నారని ఆరోపించారు. గిరిజన రైతులను బహిరంగంగా బెదిరించడం, “చనిపోండి” అనే విధంగా మాట్లాడటం అత్యంత బాధాకరమని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం పెద్ద పారిశ్రామిక వర్గాలకు వేల ఎకరాల భూములను లీజుకు ఇస్తూ, మరోవైపు జీవనోపాధి కోసం ఒకటి, రెండు ఎకరాల్లో సాగు చేస్తున్న గిరిజన రైతులపై దాడులు, బెదిరింపులు, కేసుల పేరుతో వేధింపులకు పాల్పడడం అన్యాయమని విమర్శించారు. ఫారెస్ట్ అధికారుల వేధింపులు వెంటనే నిలిపివేయాలని, లేకపోతే గిరిజనులను ఏకం చేసి జిల్లా ఫారెస్ట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. బాధితురాలిని వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫారెస్ట్ అధికారి జయశ్రీని వెంటనే సస్పెండ్ చేసి, ఆమెపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొత్త నరసింహులు, ముదాం అరుణ్, స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -