- Advertisement -
నవతెలంగాణ-ఆర్మూర్
మండలంలోని ఇస్సపల్లి గ్రామంలో బుధవారం జలసిరి కార్యక్రమంలో భాగంగా గ్రామసభ నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీఓ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పంట కుంటలు నిర్మించుకోవాలని, ఇంటింటికీ ఇంకుడు గుంటలు నిర్మించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇట్టం జీవన్ వనిత, ఉప సర్పంచ్ సట్లపల్లి ముత్తెన్న, పంచాయితీ కార్యదర్శి వందన, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -



