- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
గురు పౌర్ణమి సందర్భంగా సెంట్రల్ కమిటీ ఎండోమెంట్ ధార్మిక పరిషత్ సూచనల మేరకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇస్కాన్‌కు చెందిన అరవింద్ కృష్ణదాస్ ప్రభుజీ మాట్లాడుతూ.. “తన జీవితం సమాజ సేవకే అంకితం” అని పేర్కొన్నారు. భవానిపేట్ – ఆరేపల్లి గ్రామాల మధ్య ఉన్న అనాథాశ్రమాన్ని నిర్వహిస్తూ నిరుపేదలకు సేవలందిస్తున్న శోభా నాయక్ దంపతులను ఘనంగా సన్మానించి వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎండోమెంట్ కామారెడ్డి జిల్లా కో-కన్వీనర్ పన్యాల నరేందర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు చేగంటి నరేష్, గంగయ్య, బాబా గౌడ్, రవి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



