- Advertisement -
నవతెలంగాణ – (వేల్పూర్) ఆర్మూర్
మండలంలోని రామన్నపేట్ గ్రామంలో జలసిరి కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక గ్రామసభ జరిగింది. ఈ సమావేశంలో సర్పంచ్ బేల్దారి నవీన్ ప్రతీ ఇంటికి ఇంకుడు గుంత నిర్మించుకోవాలని ఫారం పాండ్స్, మ్యాజిక్ డ్రైన్స్, రీఛార్జ్ బోరెవెల్స్ నిర్మాణాల గురించి వివరించారు. అదేవిధంగా ఎస్ఐఆర్ మ్యాపింగ్ 100 శాతం పూర్తి చేయడంలో కృషి చేసిన బిఎల్ ఓ, రెవిన్యూ సిబ్బంది, హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బందికి, గ్రామంలోని ఫారం లు నింపడంలో సహకరించిన యువతీ యువకులకు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమం పాలకవర్గ సభ్యులు గ్రామ ప్రజలు అంగన్వాడి టీచర్ హెల్త్ డిపార్ట్మెంట్ ఏఎన్ఎంలు ఫీల్డ్ అసిస్టెంట్ గణేష్, జిపిఓ లుఇతర శాఖల సిబ్బంది, పాల్గొన్నారు.
- Advertisement -



