Wednesday, July 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పద్మా దేవేందర్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ నాయకుడు తుమ్మల రాకేష్

పద్మా దేవేందర్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ నాయకుడు తుమ్మల రాకేష్

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి
బీఆర్ఎస్ కామారెడ్డి 35వ వార్డు పార్టీ సీనియర్ నాయకుడు, వార్డు ఇంచార్జ్ తుమ్మల రాకేష్ బుధవారం మెదక్ కలెక్టరేట్‌లో మాజీ డిప్యూటీ స్పీకర్, పద్మా దేవేందర్ రెడ్డిను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తుమ్మల రాకేష్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు ఇప్పటికీ గుర్తుంచుకున్నారని అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మరోసారి బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ చూపించి విజయాన్ని అందిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. అనంతరం పద్మా దేవేందర్ రెడ్డి పార్టీ బలోపేతానికి సంబంధించిన పలు సూచనలు, మార్గదర్శకాలను అందించగా, వాటిని సమయస్ఫూర్తితో అమలు చేస్తానని తుమ్మల రాకేష్ తెలిపారు. కామారెడ్డి నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తూ, రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించేందుకు కట్టుబడి పనిచేస్తానని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -