నవతెలంగాణ – కామారెడ్డి, పాల్వంచ
పాల్వంచ మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పల్లె రమేష్ గౌడ్‌తో కలిసి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పాల్వంచ మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షునిగా బండ రమేశ్వర్పల్లి గ్రామ సర్పంచ్ నాగరాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తెలిపారు. అనంతరం మండలంలోని గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యలను సర్పంచులు షబ్బీర్ అలీ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాడి సర్పంచ్ నర్సారెడ్డి, పాల్వంచ సర్పంచ్ శేఖర్, సింగారాయిపల్లి సర్పంచ్ లత–అంజయ్య, ఇస్సాయిపేట సర్పంచ్ లలిత–నర్సింలు, ఆరెపల్లి సర్పంచ్ జ్యోతి–భూమయ్య, మంథని దేవునిపల్లి సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, భవానీపేట తండా సర్పంచ్ తిరుపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు.
షబ్బీర్ అలీని కలిసిన పాల్వంచ కాంగ్రెస్ సర్పంచులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



