Friday, March 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆదివారం పేటలో అంబేద్కర్ యువజన సంఘం గ్రామ కమిటీ ఏర్పాటు

ఆదివారం పేటలో అంబేద్కర్ యువజన సంఘం గ్రామ కమిటీ ఏర్పాటు

- Advertisement -

నవతెలంగాణ-కాటారం : గ్రామ అభివృద్ధి, యువతలో సామాజిక చైతన్యం పెంపొందించడమే లక్ష్యంగా అంబేద్కర్ యువజన సంఘం గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం అంబేద్కర్ యువజన సంఘం మండల హడక్ కమిటీ అధ్యక్షుడు ఇసునం మహేందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామ అధ్యక్షుడిగా ఆతుకూరి రాజబాబు, గౌరవ అధ్యక్షుడిగా తోటపల్లి రాజబాబు, ఉపాధ్యక్షులుగా ఆతుకూరి సురేష్, ఆతుకూరి వెంకటేష్ ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా సిగ్గేమ్ రాహుల్, కోశాధికారిగా డోంగీరీ రవి బాధ్యతలు స్వీకరించారు.

అలాగే కార్యవర్గ సభ్యులుగా అట్టల రాకేష్, కుమ్మరి స్వామి, డోగిరి స్వామి, చిలుముల శివప్రసాద్, దుర్గం మహరాజ్ నియమితులయ్యారు.

ఈ సందర్భంగా ఇసునం మహేందర్ మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధికి యువజన సంఘాలు కీలక పాత్ర పోషించాలని తెలిపారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

గ్రామ ప్రజలు, యువకులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన కమిటీకి అభినందనలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -