- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
మండల కేంద్రంలోని శ్రీ సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణిమ సందర్బంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా ఆలయ ఆవరణంలో సత్యనారాయణ వ్రతాలు, అన్నదానాలు నిర్వహించారు. గ్రామంలోని భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాన్ని సందర్శించి, నైవేద్యాలు సమర్పించి, పూజలు చేశారు. దీంతో ఆలయానికి భక్తుల తాకిడితో పోటెత్తింది.
- Advertisement -



