- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో మండల కేంద్రమైన తాడిచెర్ల ఓపెన్ కాస్ట్-1గనిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. మైన్లో భారీగా వర్షపు నీరు చేరడంతో ఉత్పత్తి పనులు పూర్తిగా నిలిచిపోయి 18 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 2 లక్షల 40 వేల క్యూబిక్ మీటర్ల ఓబీ తొలగింపు పనులకు ఆటంకం కలిగిందని బొగ్గు తవ్వకాలు చేపట్టిన ఏఎమ్మార్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి, కేఎస్ఎన్ మూర్తి, మైన్ మేనేజర్ శ్రీనివాస్ బుధవారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. మైన్లో చేరిన నీటిని మోటార్ల ద్వారా బయటకు పంపుతున్నామని, వర్షం తగ్గిన వెంటనే పనులను పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తామన్నారు.
- Advertisement -



