Wednesday, July 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా విద్యాధికారి

పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా విద్యాధికారి

- Advertisement -

నవతెలంగాణ-కోహెడ  
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను జిల్లా విద్యాధికారి చీరంశెట్టి రమేష్ బుధవారం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్మాణంలో ఉన్న వివిధ బ్లాక్‌ల పురోగతి, నాణ్యత ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి పాఠశాల నిర్మాణాన్ని పూర్తిస్థాయిలో పూర్తి చేస్తామని సైట్ ఇంజనీర్ వివరించారు. తంగళ్లపల్లి ఉన్నత పాఠశాలను సందర్శించి, రికార్డులను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పోషక విలువలతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపు కోసం ప్రతి ఉపాధ్యాయుడు బాధ్యతాయుతంగా కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఏ. మహేందర్ రెడ్డి, ఎం. సురేందర్ రెడ్డి, బి. శ్రీరాములు, సీ.ఆర్.పీ రాజేశం, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -