- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలో బుధవారం గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించినారు. పలు ఆలయాల యందు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినారు. మెడికల్ భవనంలో నగేష్ శర్మ గురుస్వామి ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలలో ఈ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. నగేష్ శర్మ గురుస్వామి చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని ఈ సందర్భంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు అర్గుల్ సురేష్, రామ్ చందర్, నూకల శేఖర్, కె.వి. రమణ, రజనిష్ కిరాడ్, కర్తన్ నవీన్, గుద్దేటి రమేష్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



