Wednesday, July 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డోన్ గావ్ లో గ్రామసభ సమావేశం

డోన్ గావ్ లో గ్రామసభ సమావేశం

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని డోన్ గావ్ గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలుపై చర్చించుటకు గ్రామ సభ సమావేశం నిర్వహించడం జరిగిందని జిపి కార్యదర్శి అంజయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రామసభ భలు గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్రామ సభలో చర్చించిన విషయాలను గ్రామస్తులకు తెలిపామన్నారు. తాగునీటి సరఫరా, నీటి సమస్యల పరిష్కారం, పారిశుధ్యం, డ్రైనేజీ, చెత్త నిర్వహణ , గ్రామ రహదారుల మరమ్మతులు, కొత్త రోడ్ల ప్రతిపాదనలు , వీధి దీపాల ఏర్పాటు, నిర్వహణ, హరితహారం, పల్లె ప్రకృతి వనం, మొక్కల సంరక్షణ, 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల సమీక్ష, (MGNREGS) పనులు, ఉపాధి అవకాశాలు, పన్నుల వసూళ్లు, గ్రామ పంచాయతీ ఆదాయ వృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, అర్హులైన లబ్ధిదారుల ఎంపిక, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధి , ఆరోగ్యం, దోమల నివారణ మరియు పారిశుధ్య చర్యలు వ్యవసాయం, పశుసంవర్ధక,రైతుల సమస్యలు, మహిళా సంఘాలు, యువజన సంఘాల అభివృద్ధి , గ్రామ భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలన, రోడ్డు భద్రత వార్డుల వారీగా ప్రజా సమస్యలపై చర్చ, పరిష్కారాలు గ్రామ అభివృద్ధికి కొత్త ప్రతిపాదనలు, తీర్మానాలు, గ్రామంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతి సమీక్ష నిర్వహించారు. ఈ గ్రామసభ సమావేశంలో సర్పంచ్ ఖానాపూరే శ్రీనివాస్, ఉప సర్పంచ్ హన్ము గోండ, పంచాయతీ కార్యదర్శి అంజయ్య, ఏ ఈ ఓ (AEO): శ్రీలేఖ, ఐకెపిసిసి (IKP CC:) రాములు, మిషన్ భగీరథ హెల్పర్ బాలాజీ గ్రామ ప్రజలు, తమ విలువైన సూచనలు, అభిప్రాయాలు తెలియజేసి గ్రామ అభివృద్ధికి సహకరించాలని సర్పంచ్ పేర్కొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -