నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని పలు గ్రామాలలో గ్రామ సర్పంచుల అధ్యక్షతన గ్రామసభలు నిర్వహించడం జరిగిందని ఆయా గ్రామాల జిపి కార్యదర్శులు తెలిపారు. ఈ సందర్భంగా మండలంలోని మహారాష్ట్ర సరిహద్దు గ్రామమైన చండేగావ్ సర్పంచ్ బండేడ్ వార్ లక్ష్మణ్ , డోన్ గావ్ సర్పంచ్, మధుర తండా సర్పంచ్ అనిత మోహన్ చౌహన్, అధ్యక్షతన ఆయా గ్రామాల జిపి కార్యదర్శులు వికాస్ రెడ్డి, అంజయ్య, స్రవంతి, గ్రామాలలోని అభివృద్ధి కార్యక్రమాలు , ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరు, నీటి వసతి , పాఠశాలల పనితీరు , అంగన్వాడీల నిర్వహణ , అంతర్గత రోడ్ల సమస్యలు , సిసి రోడ్లు, శానిటేషన్ పనులు, గ్రామీణ వైద్యం, పంటల నిర్వహణ, విద్యుత్ సమస్యలు, పలు గ్రామాలలో నెలకొన్న సమస్యలపై గ్రామస్తులతో గ్రామ కార్యదర్శి ప్రజలకు తెలుపుతూ చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులతో పాటు జిపి కార్యదర్శులు , ఉప సర్పంచ్లు , వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
గ్రామాలలో ముమ్మరంగా కొనసాగుతున్న గ్రామసభలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



