నవతెలంగాణ – మల్హర్ రావు
తిరుమల తిరుపతి దేవస్థానం నుండి స్వామివారి పూజా కలశం కొయ్యూరు గ్రామానికి వచ్చిన సందర్భంగా గ్రామస్తులు బుధవారం అంగరంగ వైభవంగా పూజలతో ఊరేగింపు నిర్వహించారు.ఇట్టి కలశాన్ని గ్రామ ప్రజలు, ఆడపడుచులు అందరూ ఊరేగింపుగా ఊరేగించి హనుమాన్ టెంపుల్ వద్ద స్థాపించి పూజలు చేశారు. చిరుతల రామాయణం భక్తులు ప్రత్యేక అలంకరణతో ఇట్టి ఊరేగింపును దేవస్థాన చైర్మన్ ఎడ్ల పెద్ద నారాయణ ఇంటి వద్ద నుండి ప్రారంభమై లక్ష్మీ దేవర ఆలయం నుండి కొయ్యూరు అభయాంజనేయ స్వామి ఆలయం వరకు ఊరేగింపు జరిగిన ఈ మహోత్సవంలో స్థానిక సర్పంచ్ కొండ రాజమ్మ తో పాటు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని కలశపూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని పంట పైరు పండేలా, గ్రామ ప్రజలు ఆయురారోగ్యంగా ఉండేలా తిరుమల తిరుపతి దేవుని ఆశీస్సులు ఉండాలని ఏడుకొండల స్మరణలతో నినాదాలు చేస్తూ గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.
కొయ్యూరులో వైభవంగా కలశం ఊరేగింపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



