• సెప్టెంబర్ 1లోపు అమలు చేయకుంటే ఉద్యమమే
• పీఆర్టీయూ మండల నూతన కార్యవర్గం ఎన్నిక
నవతెలంగాణ -పెద్దవంగర
సీపీఎస్ విధానం రద్దు చేసి, ప్రభుత్వం వెంటనే పాత పెన్షన్ విధానాన్ని (OPS) అమలు చేయాలని పీఆర్టీయూ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు మిర్యాల సతీష్ రెడ్డి అన్నారు. కిష్టు తండాలో మంగళవారం నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం సతీష్ రెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ 1లోపు ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయాన్ని ప్రకటించాలని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు పెండింగ్ లో ఉన్న డీఏలను విడుదల చేయడంతో పాటుగా, పీఆర్‌సీని వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అనంతరం పీఆర్టీయూ మండల నూతన కమిటీని ప్రకటించారు. మండల అధ్యక్షుడిగా గంగిశెట్టి రమేష్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ యకూబ్ పాషా ఇరువురు రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసోసియేట్ అధ్యక్షులుగా టి. విద్యాసాగర్, మహిళా అసోసియేట్ అధ్యక్షులుగా ఎం. వాణి, ఎం. మహబూబీ, ఉపాధ్యక్షులుగా కె. బాలరాజు, జి. ఉపేందర్, మహిళా ఉపాధ్యక్షులుగా పి. రజిత, కె. హైమ, కార్యదర్శిగా బి. రవి, మహిళా కార్యదర్శిగా ఎం. ఉమాదేవి ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా జి. శ్రీనివాస్ రెడ్డి, ఆర్. చంద్రశేఖర్ వ్యవహరించారు. కార్యక్రమంలో ఎ. శ్రీనివాస్ రెడ్డి, బి. వేణుమాధవ్, టి. విద్యాసాగర్, ఎస్. అంజయ్య, కె. వెంకట శ్రీనివాస్, డీకే వెంకటేశ్వర్లు, మహబూబ్ అలీ, ఎం. వాణి, ఎం. ఉమాదేవి, పి. రజిత తదితరులు పాల్గొన్నారు.



