Thursday, July 30, 2026
E-PAPER
Homeఆటలుతొలి టెస్ట్‌‌లో 
విండీస్‌ ‌గెలుపు

తొలి టెస్ట్‌‌లో 
విండీస్‌ ‌గెలుపు

- Advertisement -

పాకిస్తాన్‌‌పై 90 పరుగుల తేడాతో 
ఘన విజయం
ట్రినిడాడ్‌: తొలి టెస్టు క్రికెట్‌లో ఆతిథ్య వెస్టిండీస్‌ ‌జట్టు ఘన విజయం సాధించింది. బ్రియాన్‌ ‌లారా స్టేడియంలో జరిగిన తొలి టెస్ట్‌‌లో విండీస్‌ ‌జట్టు 90 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ ‌ను చిత్తుచేసింది. 211 పరుగుల ఛేదనలో భాగంగా పాకిస్తాన్‌ ‌120 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్‌ ‌బాబర్‌ అజామ్‌(58నాటౌట్‌) అర్ధసెంచరీకి తోడు అబ్బాస్‌(23) మాత్రమే రెండంక్కెల స్కోర్‌ ‌చేశారు. మిగతా బ్యాటర్లంతా సింగిల్‌ ‌డిజిట్‌‌కే పరిమితమయ్యారు. వెస్టిండీస్‌ ‌బౌలర్లు జేడెన్‌ ‌సీల్స్‌కు ఐదు, రోచ్‌, గ్రీవ్స్‌‌కు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ‌ది మ్యాచ్‌ గ్రీవ్‌‌కు దక్కింది. ఈ టెస్ట్‌‌లో ఓటమితో పాకిస్తాన్‌ ‌జట్టు విదేశీ గడ్డపై వరుసగా 8వ పరాజయం. 2023 డిసెంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనతో ప్రారంభమైన పాకిస్థాన్ ఓటముల పరంపర నిరంతరంగా కొనసాగుతోంది. ఆసీస్ గడ్డపై 3-0తో వైట్‌‌వాష్‌‌కు గురైన పాక్, ఆ తర్వాత దక్షిణాఫ్రికాలోనూ రెండు టెస్టుల్లోనూ ఓటమి చవిచూసింది. ఈ ఏడాది బంగ్లాదేశ్‌పై జరిగిన రెండు టెస్టుల్లోనూ, తాజా విండీస్ పర్యటనలోని తొలి టెస్టు ఓటమితో ఈ చెత్త రికార్డు నమోదైంది. ఈ ఓటమితో పాక్‌ జట్టు (6.66% పీసీటీ) డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానానికి పడిపోయింది.

వెస్టిండీస్‌ : 311, 181
పాకిస్తాన్‌ : 282, 120

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -