పుష్పగుచ్ఛం అందించి
స్వాగతం పలికిన కలెక్టర్
ఎన్‌ఎస్పీ అతిథి గృహంలో పోలీసుల
గౌరవ వందనం స్వీకరించిన మనోజ్ సిన్హా
నవతెలంగాణ-ఖమ్మం కలెక్టరేట్
జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా బుధవారం ఖమ్మం జిల్లా పర్యటనకు విచ్చేశారు. జిల్లా పర్యటన సందర్భంగా ఎన్‌ఎస్పీ అతిథి గృహానికి చేరుకున్న ఆయనకు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ఘనంగా స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం అందించి మర్యాదపూర్వకంగా ఆహ్వానించిన కలెక్టర్.. అధికారుల తరపున శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఎన్‌ఎస్పీ అతిథి గృహం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీసుల గౌరవ వంద నాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సునీల్ దత్, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ పార స్ కుమార్ లతో పాటు పలువురు జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధు లు, ప్రముఖులు లెఫ్టినెంట్ గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన లెఫ్టినెంట్ గవర్నర్‌కు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ఖమ్మం జిల్లా సమగ్ర అభివృద్ధిపై వివరించారు. జిల్లాలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, వ్యవసాయ అభివృద్ధి, పారిశ్రామిక పురోగతి, సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల విస్తరణ, గ్రామీణ, పట్టణాభివృద్ధి, పెట్టుబడుల ప్రోత్సాహం తదితర అంశాలపై వివరిం చారు. అదేవిధంగా జిల్లా భౌగోళిక స్వరూపం, సహజ వనరులు, సాంస్కృతిక వారసత్వం, పారిశ్రామిక అవకాశాలు, ప్రభుత్వ ప్రాధా న్యతా కార్యక్రమాల అమలు, ప్రజలకు అందిస్తున్న సేవలు, జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని కలెక్టర్ తెలిపారు. జిల్లా సమగ్రాభివృద్ధి కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తు న్నాయని చెప్పారు. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వివిధ కార్యక్రమాల్లో పాల్గొని, జిల్లా ప్రజల ఆతిథ్యానికి అభినందనలు తెలిపారు. అనంతరం తన తదుపరి పర్యటన కార్యక్రమాలకు హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు.
ఖమ్మం జిల్లా పర్యటనలో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



